కిరాయి మనుషులతో కేసీఆర్, కేటీఆర్ దొంగ నాటకాలు

కర్నాటకలో తామిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఎలాగు ఓడిపోతున్నామని గ్రహించి ఎక్కడి నుంచే కిరాయికి మనుషులను తెచ్చుకుని కేసీఆర్, కేటీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.

Update: 2023-10-28 08:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలో తామిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఎలాగు ఓడిపోతున్నామని గ్రహించి ఎక్కడి నుంచే కిరాయికి మనుషులను తెచ్చుకుని కేసీఆర్, కేటీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మీరు చేస్తున్న ఆరోపణలే నిజమైతే కర్నాటకకు వెళ్లి చూద్దాం రావాలని ఛాలెంజ్ చేశారు. తొమ్మిదేళ్లు అధికారమిస్తే ఏం చేశారో చెప్పుకోలేక తెలంగాణలో అధికారంలోనే లేని కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం గాంధీ భవన్ లో నిర్వహించిన 'తెలంగాణ ప్రశ్నిస్తోంది' క్యాంపెయినింగ్ లో భాగంగా చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వంశీ చందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణ మార్చింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో నిరుద్యోగత రేటు 15.1శాతంగా ఉంది. కేసీఆర్, కేటీఆర్ కు నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న 3,607 మంది ఆత్మ శాంతి కలగాలంటే కేసీఆర్ కుటుంబ పాలనను అంతమోందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి నూతన విధానాలతో నియామక బోర్డు ను ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లపై తీవ్రమైన పోటీ ఉందని అందువల్లే అందరికి అకామిడేట్ చేయలేకపోతున్నామన్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే గెలుపు గుర్రాలను బరిలోకి దింపామన్నారు. టికెట్లలో ఏ వర్గాలకైనా సంతృప్తి పరచలేకపోతే అధికారంలోకి రాగానే వారి జనాభా ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. జేడీఎస్, బీఆర్ఎస్ వేర్వేరు కావని అన్నారు.

ఓయూకు రావాలని ఛాలెంజ్:

తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారు. అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలని వంశీ చందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాజ్‌లు ఛాలెంజ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు బీఆర్ఎస్ నేతలు రావాలని సవాలు విసిరారు. ఈ మేరకు మరికాసేపట్లో గాంధీ భవన్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ నాయకులు బయలు దేరనున్నారు.

Tags:    

Similar News