తొమ్మిదేళ్లలో కేటీఆర్ ఒక్కసారి కూడా రాలేదు: వీరయ్య
వికలాంగులకు 6 వేల పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుందామని? బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఫైర్ అయ్యారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... విద్యలో 4 శాతం రిజర్వేషన్ అమలు ఎక్కడా? అని ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వికలాంగులకు 6 వేల పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుందామని? బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఫైర్ అయ్యారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... విద్యలో 4 శాతం రిజర్వేషన్ అమలు ఎక్కడా? అని ప్రశ్నించారు. స్వతంత్ర వికలాంగుల కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లాకో స్టడీ సర్కిల్ ఏమైందని ఫైర్ అయ్యారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ను కూడా మూసివేశారన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు ఇస్తామని ప్రామిస్ చేశారని, కానీ తొమ్మిదిన్నర ఏళ్లైనా.. కనీసం ఒక్క కార్డు కూడా ఇవ్వకపోవడం ఏమిటనీ? మండిపడ్డారు. గడిచిన 9 ఏళ్లుగా ప్రపంచ వికలాంగుల దినోత్సవాలలో కనీసం ఒక్క దానికి కూడా కేటీఆర్ హాజరు కాకపోవడం దారుణమన్నారు. దొర తనానికి ఇది నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో వికలాంగుల ఓట్ల కోసం ఇప్పుడు సానుభూతి చూపించడం విచిత్రంగా ఉన్నదన్నారు.