BRS అభ్యర్థులకు సెక్యూరిటీ పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ (వీడియో)

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనాగ్రహానికి బలి అయ్యే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అన్నారు. కాబట్టి వారందరికీ జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని, కావలసిన భద్రత ఇవ్వాలని, సాధారణ ప్రజలు వారి దగ్గరకు పోకుండా కాపాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను జడ్సన్ కోరారు.

Update: 2023-11-03 10:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనాగ్రహానికి బలి అయ్యే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అన్నారు. కాబట్టి వారందరికీ జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని, కావలసిన భద్రత ఇవ్వాలని, సాధారణ ప్రజలు వారి దగ్గరకు పోకుండా కాపాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను జడ్సన్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి లాంటి వారు ఆత్మహత్య చేసుకోని అమరులు అయ్యారని, కానీ నేడు ప్రజలు నేతలపై తిరగబడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రచారంలో భాగంగా ఒక మీటింగ్‌కు వెళితే నీళ్ల ప్యాకెట్ విసిరేసారని, ఊర్లలో ఎమ్మెల్యేలను ప్రజలు పరిగెత్తిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఓ వ్యక్తి దళితబంధు రాలేదని ఎంపీని కత్తితో దాడి చేయబోయడని, ఆ విషయాన్ని రాజకీయం చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. కాబట్టి బీఆర్ఎస్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి వికాస్ రాజ్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు ఇవాళ మీడియాతో బక్క జడ్సన్ మాట్లాడారు.


Tags:    

Similar News