తెలంగాణలో జనసేన లేదు.. అలాంటప్పుడు టికెట్ ఎలా ఇస్తారు?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు, సీట్ల వ్యవహారంలో చర్చలు జరుగుతున్న సమయంలో బీజేపీలో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఇప్పటకే కూకట్‌పల్లి, శేర్ లింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో ఆ ప్రాంతానికి చెందిన నేతలు నిరసనకు దిగారు.

Update: 2023-11-02 13:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు, సీట్ల వ్యవహారంలో చర్చలు జరుగుతున్న సమయంలో బీజేపీలో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఇప్పటకే కూకట్‌పల్లి, శేర్ లింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో ఆ ప్రాంతానికి చెందిన నేతలు నిరసనకు దిగారు. తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ దిలీపాచారి ఇవాళ ఆయన అనుచరులతో కలిసి బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. జనసేన వద్దు.. బీజేపీ ముద్దు అని నినాదాలు చేశారు. జనసేన అసలు తెలంగాణలో లేదని, అలాంటప్పుడు టికెట్ ఎలా ఇస్తారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బీజేపీ స్టేట్ ఆఫీస్ నిరసనలతో అట్టుడికింది.

Tags:    

Similar News