EC పర్మిషన్‌తో మరో హెలికాప్టర్‌లో దేవరకద్రకు సీఎం కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ ప్రయాణానికి హెలికాప్టర్‌లో సాకేంతిక సమస్య ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సమస్యను గుర్తిండతో వెంటనే హెలికాప్టర్‌ను తిరిగి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మళ్లించి సేఫ్ ల్యాండ్ చేశారు.

Update: 2023-11-06 10:03 GMT
EC పర్మిషన్‌తో మరో హెలికాప్టర్‌లో దేవరకద్రకు సీఎం కేసీఆర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ ప్రయాణానికి హెలికాప్టర్‌లో సాకేంతిక సమస్య ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సమస్యను గుర్తిండతో వెంటనే హెలికాప్టర్‌ను తిరిగి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మళ్లించి సేఫ్ ల్యాండ్ చేశారు. అనంతరం మరో హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే ఎన్నికల సంఘం నింబంధనల మేరకు ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ హెలికాప్టర్ కోసం ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఈసీతో సంప్రదింపులు జరిపిన అనుమతులు తీసుకున్నారు. అనంతరం ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ను ఫామ్ హౌస్ కు రప్పించింగా అందులో ప్రయాణించిన కేసీఆర్ ఇవాళ్టి ఎన్నికల ప్రచార షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు.

Tags:    

Similar News