సొంత కార్యకర్తలపై మండిపడ్డ కేసీఆర్.. కోపంలో ఏం అన్నారంటే?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ సభలో కొందరు ఆకతాయిలు లొల్లి, సిటీలు కొట్టడంతో కేసీఆర్ వారిపై మండిపడ్డారు. ‘ఎవడయ్య వాడు పనిలేదా వానికి, ఆ పక్కకు ఉన్నోడన్న ఆపోచ్చుగదనయ్యా.. ఎందుకు అరుస్తారయ్యా, నాకు అర్థం కాదు.. నేను మాట్లాడుతున్నా నీకు అర్థం అయితలేదా? నేను మాట్లాడేది జనాలకు వినపడొద్దా? ఆ పక్కకున్న ఉన్న పెద్ద మనుషులు కంట్రోల్ చేయండి.. మనోడైతే అట్లా అరవడని, జనార్ధన్ రెడ్డి వాడు మనోడేనా? అంటూ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రశ్నించారు.