అక్టోబర్ 1న సీపీఎం, సీపీఐ పోటీ చేసే స్థానాల ప్రకటన!

తెలంగాణ రాజకీయాల్లో కామ్రేడ్ ల పొత్తు రాజకీయం ఎటూ తేలడం లేదు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.

Update: 2023-09-21 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కామ్రేడ్ ల పొత్తు రాజకీయం ఎటూ తేలడం లేదు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా గురువారం హైదరాబాద్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇవాళ్టి తమ భేటీలో కాంగ్రెస్ తో పొత్తు అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. అక్టోబర్ 1న మరోసారి తాము కలిసి పోటీ చేయబోయే స్థానాలపై చర్చిస్తామన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన బీజేపీకి సహకరించేలా ఉందని ఆరోపించారు. బీజేపీ కోసమే ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ కోసం ఎంఐఎం అనే రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్లను చీల్చిందన్నారు. మహిళల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తామన్నారు.

Tags:    

Similar News