సమిష్టిగా జరుపుకునే ‘బతుకమ్మ’ తెలంగాణకు ప్రత్యేకం: సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని సీఎం కేసీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2023-10-22 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని సీఎం కేసీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవటం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞతాభావనను తెలియజేస్తాయని చెప్పారు.

సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకొనే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని వెల్లడించారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించారు.

Tags:    

Similar News