కేటీఆర్ కీలక ప్రకటనను లైట్ తీస్కున్న సొంత నేతలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చివరకు బిల్లుపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా.. ఈసారికి గండం గట్టెక్కినట్లే అంటూ లోలోపల సంబురాలు చేసుకున్నారు.

Update: 2023-09-22 12:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చివరకు బిల్లుపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా.. ఈసారికి గండం గట్టెక్కినట్లే అంటూ లోలోపల సంబురాలు చేసుకున్నారు. ఈ బిల్లును తక్షణమే అమలు చేయాలని పైకి చెబుతున్నా.. చాలామంది నాయకులు మాత్రం ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎక్కడ తమ టికెట్‌కు ఎసరు వస్తుందోనని లోలోపల టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం తన సీటును త్యాగం చేయడానికైనా సిద్ధమే అంటూ ప్రకటన చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన కరువైంది.

అందుకే సపోర్ట్ ఇవ్వలేదా..?

అధికార బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌ అయిన కేటీఆర్‌కు నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేటీఆర్ ఏదైనా పిలుపునిస్తే తూ.చ. తప్పకుండా పాటిస్తుంటారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టిన పలు నిరసనల కార్యక్రమాలకు పిలుపునిస్తే గంటల వ్యవధిలోనే అమలు పరిచారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎవరూ సపోర్టుగా నిలవడం లేదు. కేటీఆర్ చెప్పినట్లుగా తాము కూడా తమ స్థానాలను వదులుకునేందుకు సిద్ధమని ప్రకటిస్తే నియోజకవర్గంలోని మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత రావొచ్చని.. అనవసర విషయంలో తలదూర్చి ఇబ్బందుల పాలు కావడం దేనికనే ఆలోచనతోనే సపోర్ట్‌గా నిలవలేదనే చర్చ జరుగుతున్నది. ఏదిఏమైనా కారు పార్టీలో కేటీఆర్ ఎంత చెప్తే అంతా.. ఏది చెబితే అదే అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం కాదనే విషయం ఈ టాపిక్ ఓ ఉదాహరణగా నిలిచినట్లు టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News