ఏం పాపం చేస్తున్నారని మోసం చేస్తున్నావ్.. కేసీఆర్‌పై ‘బండి’ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తావని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం ప్రజలనే కాదని.. దేవుళ్లను కూడా మోసం చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న ఆలయానికి నయాపైసా ఇవ్వకుండా.. రాజన్న పైసలను కామారెడ్డికి కేటాయించాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకోవడంలో అభ్యంతరం లేదు కానీ, మరి మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించి ఆ జిల్లా ప్రజలను మోసం చేశారు. కరీంనగర్‌ను డల్లాస్, న్యూయర్క్ను చేస్తానని మోసం చేశారు. గజ్వేల్‌ను నెంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి వాళ్ళను మోసం చేశారు. ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని మండిపడ్డారు.