TS: అందరిలోనూ ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు జరిగేది ఇలానే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు. అంతేకాదు.. కౌంటింగ్ సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేది ఎలాగో ఒకసారి తెలుసుకుందాం.
= ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.
= ఒక్కో కేంద్రంలో దాదాపు 14 మంది ఏజెంట్లు, అభ్యర్థుల ప్రతినిధులకు అనుమతి ఉంటుంది.
= లెక్కించే అధికారికి తప్ప మరెవరి వద్దా సెల్ ఫోన్ ఉండకూడదు.
= ఫారం-17Cలో నమోదైన ఓట్లను ఈవీఎం ఓట్లతో సరిచూస్తారు.
= ఆ సంఖ్యను 17C పార్ట్-2లో నోట్ చేసి ఏజెంట్ల సంతకం తీసుకుంటారు.
= ముందుగా ఈవీఎంల సీల్ తీసి రిజల్ట్ బటన్ నొక్కుతారు.
= ఒక్కో రౌండ్ ఫలితాలను కౌంట్ చేసి చివర్లో రిజల్ట్ ప్రకటిస్తారు.