కమ్యూనిస్టులతో తేలని పొత్తు.. 60 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్!

బస్సు యాత్ర కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నది. ఈ నెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా ఏఐసీసీ నుంచి లిస్టు విడుదలయ్యే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2023-10-14 03:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బస్సు యాత్ర కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నది. ఈ నెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా ఏఐసీసీ నుంచి లిస్టు విడుదలయ్యే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగులు పూర్తయ్యాయి. 119 నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన స్క్రీనింగ్ కమిటీ... వంద సెగ్మెంట్‌లకు సింగిల్ నేమ్‌తో జాబితాను తయారు చేసింది. ఆ లిస్టు‌ను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ప్రతిపాదించగా... 60 మంది అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపింది. మిగతా అభ్యర్థుల సెలక్షన్ పై నేడు మరోసారి స్క్రీనింగ్, సీఈసీ కమిటీలు భేటీ కానున్నాయి.

మరోవైపు కమ్యూనిస్టులతో పొత్తు అంశం‌పై కూడా తేల్చేందుకు నేడు మీటింగ్ నిర్వహించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఈ టైంలో పొత్తుల అంశం ఫైనల్ అయ్యే చాన్స్ ఉన్నది. పొత్తుల్లో సయోధ్య కుదిరితే స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై, పొత్తుతో కూడి జాబితాను ఫిక్స్ చేయనున్నారు. ఇక ఖర్గే మూడు రోజుల పాటు కర్ణాటక టూర్‌కు వెళ్లారు. ఆయన రాగానే టిక్కెట్లు ప్రకటన ఉండొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమ్యూనిస్టులతో పొత్తు అవసరం లేదని టీ కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దలను కోరడం గమనార్హం.

119 స్థానాలకు ఒకే సారి: స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్

స్క్రీనింగ్, సీఈసీ మీటింగుల అనంతరం చైర్మన్ మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తామన్నారు. 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయగా, మిగిలిన స్థానాల్లో త్వరలోనే క్యాండిడేట్ల పేర్లు ఫిక్స్ చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పొన్నాల రాజీనామాపై స్పందించిన ఆయన.. రాజీనామాలపై రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని, పార్టీలోకి చాలా మంది వచ్చి చేరుతున్నారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News