బీజేపీ, కాంగ్రెస్‌లను టార్గెట్ చేసిన అక్బరుద్దీన్

రాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Update: 2023-11-21 06:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయబోతున్నాయన్న అంచనాలతో ఆ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మైనార్టీ వర్గాల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ఒకవైపు బీజేపీ సబ్ కా సాథ్- సబ్ కా వికాస్ నినాదంతో ఘర్ వాపసీ, లవ్ జీహాద్, బీఫ్, హిజాబ్ పేరుతో ముస్లింలను ఇబ్బందులు పెడుతున్నదని వీరి పాలన కలిగిన రాష్ట్రాల్లో బుల్డోజర్లు ఎదుర్కొంటున్నామని ముస్లింలను పోలీసు కస్టడీలో కాల్చి చంపుతున్నారని ధ్వజమెత్తారు సబ్ కా సాథ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మరోవైపు మొహబ్బత్ కీ దుకాన్ అని చెబుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 50 వేల మతపరమైన అల్లర్లను ఎదుర్కొన్నామని విమర్శించారు.

Tags:    

Similar News