'కేసీఆర్ ఛాతిలో ఉన్నది గుండె కాదు బండ'

YSRTP అధ్యక్షురాలు YS షర్మిల సీఎం కేసీఆర్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Update: 2022-10-23 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: YSRTP అధ్యక్షురాలు YS షర్మిల సీఎం కేసీఆర్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా కేసీఆర్‌లో కనీసం చలనం లేదని ఓ రేంజ్‌‌లో ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు బండ అని.. ఉద్యోగాలు అడిగితే హమాలీ పని బెస్ట్ అంటున్నారని షర్మిల మండిపడ్డారు. దొడ్డు బియ్యం ఇస్తూ రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులను బంద్ పెట్టాడని.. పేదవాడు ఎలా బతుకుతున్నారో కూడా చూసే వ్యవస్థ లేదని ఆగ్రహించారు. కనీసం ఒక అధికారి కూడా ప్రజల వైపు చుసే పరిస్థితి లేదన్నారు. ఆదివారం నిర్మల్‌ జిల్లాలో పర్యటించిన షర్మిల కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని.. తెలంగాణలో రైతుకు విలువే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పు లేని రైతు లేనే లేదని.. రుణమాఫీ అని రైతులను మోసం చేశాడు కదా అంటూ బైంసా ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో 13 లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజల పట్ల నిలబడే వ్యవస్థ లేదు.. కేసీఅర్ అరాచకాలను ప్రతి పక్షాలు ప్రశ్నించలేదని ఫైర్‌ అయ్యారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..