కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు
వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై వైఎస్సార్ టీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై వైఎస్సార్ టీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సునితాలక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ నిరుద్యోగుల కోసం పోరాడుతూ.. వారికోసం చేసిన దీక్షలను మంత్రి కేటీఆర్ మంగళవారం వ్రతాలు అంటూ సంబోధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలు నిష్టగా చేసుకునే వ్రతాలను దీక్షకు ముడిపెట్టి వ్రతాలను చులకన చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అటు షర్మిలకు, మహిళ లోకానికి తీవ్ర అవమానం అన్నారు. మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అన్నారని వైఎస్సార్టీపీ నాయకులు వినతి పత్రంలో పేర్కొన్నారు. మహిళలను చులకన భావంతో చూసే మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతలక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు.
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు KTR,నిరంజన్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ YSR తెలంగాణ పార్టీ నాయకులు మహిళాకమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతలక్ష్మారెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. 1/2#YSSharmila #YSRTP pic.twitter.com/7riI8D7LI3
— YSR Telangana Party (@YSRTelangana) September 20, 2022