వైఎస్ వివేకా హత్య కేసు: 'నిందితుడు సునీల్‌కు బెయిల్ ఇవ్వొద్దు'

వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితునిగా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హై కోర్టులో వాదనలు జరిగాయి.

Update: 2023-02-16 08:24 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితునిగా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో సునీల్ రెండో నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళ క్రితం తనకు బెయిల్ ఇవ్వాలని సునీల్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యలక్ష్మి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. సునీల్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Tags:    

Similar News