షర్మిల టెర్రరిస్టా.. హంతకురాలా?: YS విజయలక్ష్మి
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకే పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారని YS విజయలక్ష్మి అన్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకే పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారని YS విజయలక్ష్మి అన్నారు. చంచల్‌గూడ మహిళా జైలు వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె షర్మిల బెయిల్‌పై బయటకు వస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే షర్మిలను అరెస్ట్ చేసిందన్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు.. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా పోలీసులు అడ్డుపడుతున్నారు.. షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందుకే ప్రభుత్వం షర్మిల గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు.
Read More: షర్మిల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు