ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు షర్మిల కీలక హామీ

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

Update: 2022-09-12 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ''KCR పాలనలో రుణమాఫీ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. పక్కా ఇండ్లు లేవు. ఆరోగ్యశ్రీ లేదు. ఉద్యోగాలు లేవు. పోడు పట్టాలు లేవు. మహిళలకు రుణాలు లేవు... ఇలా ఎన్నో పథకాలను అటకెక్కించాడు. YSR సంక్షేమ పాలన సాధించి, మళ్లీ మంచి రోజులు తీసుకురావడమే మా లక్ష్యం.'' అంటూ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

Tags:    

Similar News