ఏ మొఖం పెట్టుకుని కేటీఆర్ ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు?
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బాధ్యత తనది కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బాధ్యత తనది కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని గతంలో చెప్పిన మీరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే పారదర్శకతనా అని ప్రశ్నించారు. అంగట్లో సరుకులా ప్రశ్నపత్రాలు అమ్ముకుంటుంటే, ఐటీ వ్యస్థలో రహస్యాలు హ్యాక్ కు గురైతే ఐటీ శాఖ మంత్రిగా మీ బాధ్యత కాదా అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఏం మొఖం పెట్టుకుని కేటీఆర్ మంత్రి పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుటుంబాన్ని ఆదివారం షర్మిల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. గతేడాది మార్చిలో అసెంబ్లీలో 88 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట ఏమైందన్నారు. కవిత ఎంపీగా ఓడిపోతే లిక్కర్ స్కామ్ చేసుకోవాలే కేసీఆర్ కాళేశ్వరం, కేటీఆర్ రియల్ ఎస్టేట్ స్కాములు చేసుకుని రాజ్యాలు ఏలుతుంటే డిగ్రీలు, పీజీలు చదివిని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవాలా ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు.
సొంత నియోజకవర్గం సిరిసిల్లలో BRS పార్టీ వాళ్ళ ఇంట్లో ఒక నిరుద్యోగి, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఏం మొఖం పెట్టుకొని KTR మంత్రి పదవిలో ఉన్నాడు? ఇంటికో ఉద్యోగం ఏమాయే?
— YS Sharmila (@realyssharmila) March 19, 2023
నిరుద్యోగ భృతి ఏమాయే? బిస్వాల్ కమిటీ ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఏమాయే?
1/3 pic.twitter.com/ofHorhNpWj