డీకేతో హోటల్‌లో షర్మిల భేటీ.. విలీనంపై ఏదో ఒకటి తేల్చేయాలని నిర్ణయం..!

కాంగ్రెస్‌లో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై ముందడుగు పడనుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శుక్రవారం భేటీ అయ్యారు.

Update: 2023-09-15 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై ముందడుగు పడనుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శుక్రవారం భేటీ అయ్యారు. 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్క్ హయత్‌లో ఆయన బస చేయనున్నారు. కాగా పార్క్ హయత్‌లో షర్మిల డీకే శివకుమార్‌ను కలిసినట్లు సమాచారం. పార్టీ విలీనంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విలీనం అంశంపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన పూర్తయ్యేలోపు ఏదో ఒక స్పష్టత ఇచ్చేయాలని షర్మిల భావిస్తోంది. అందుకే విలీనం అంశంపై షర్మిల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News