ఔను.. కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది!.. కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.

Update: 2024-07-08 10:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం నడుస్తుందని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రేమలో.. బీఆర్ఎస్, బీజేపీ అనే పత్రిక కూడా మరోసారి వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రెస్ మీట్ లో అన్న మాటలపై విమర్శలు చేస్తూ బీజేపీ తెలంగాణ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ లో గత కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అవును కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అని వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అవును ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల స్కాములు, 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ కొనుగోళ్లతో వేలకోట్ల నష్టం, గొర్లు పంచుతామని చెప్పి కొట్ల కుంభకోణాలు చేసే కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని చెప్పింది.

అలాగే దళిత బంధు పేరు చెప్పి కమీషన్లు, రైతు బంధు అంటూ రాళ్లు రప్పలకు కోట్లు దొచిపెట్టే కేసీఆర్ నాయకత్వాన్ని నిజంగానే దేశం కోల్పోయిందని దుయ్యబట్టింది. ఇక హరతహారంలో డబ్బులు నొక్కొచ్చని, డబుల్ బెడ్ రూం ఇళ్లలో ముడుపులు తీసుకోవచ్చని, ధరణితో ఖబ్జాలు చేయోచ్చని, పథకాల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేయోచ్చని అద్భుత అద్వీతీయ నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని ఎద్దేవా చేసింది. లేదంటే కాంగ్రెస్ కంటే స్కాములు చేయోచ్చని కేసీఆర్ నిరూపించేవాడని, అంతేనా.. దేశమంతా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాన్ని కూడా దేశం కోల్పోయిందని సంచలన విమర్శలు చేశింది. దీనిపై తెలంగాణ ప్రజలకే కాదు.. యావత్ దేశానికి కేసీఆర్ అవినీతి తెలుసని, అందుకే సాగనంపారు అని రాసుకొచ్చింది.


Similar News