హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. రెండు రోజులు నగరంలో ఎల్లో అలర్ట్

వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజులు నగర వ్యాప్తంగా 36 నుంచి 37 ఢిగ్రీల సెల్సియస్‌తో భారీ ఎండలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Update: 2023-04-06 03:36 GMT
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. రెండు రోజులు నగరంలో ఎల్లో అలర్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజులు నగర వ్యాప్తంగా 36 నుంచి 37 ఢిగ్రీల సెల్సియస్‌తో భారీ ఎండలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ క్రమంలో మహానగరానికి ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారి చేసింది. అలాగే ఈ రెండు రోజుల వర్షాల తర్వాత రాష్ట్రంలో ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని.. ప్రజలు దీని బారిన పడకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News