తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే మరో వైపు వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే మరో వైపు వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ జిల్లాలలో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.