Thummala: చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి.. సమీక్షలో మంత్రి తుమ్మల

చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు(Minister Thummala Nageshwar Rao) అన్నారు.

Update: 2024-10-29 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు(Minister Thummala Nageshwar Rao) అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat)లో చేనేత, జౌళి శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష(Review) నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు టీజీసీవో(TGCO)కి వచ్చిన ఆర్డర్లు.. వాటి పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో(TESCO) ద్వారా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. అలాగే 2025-26 సంవత్సరానికి అవసరమగు వస్త్ర ఇండెంట్‌ను టెస్కో వారికి నవంబర్ 15, 2024 లోగా సమర్పించాలని ఆదేశించారు. ఇక చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు అధికారులు కృషి చేయాలని తుమ్మల చెప్పారు. 


Tags:    

Similar News