Women's Commission: సినిమాల్లో డాన్సులపై మహిళా కమిషన్ సీరియస్.. సంచలన ప్రకటన

ఇటీవల తెలుగు సినిమాల్లో డాన్సులు హద్దులు దాటుతున్నాయి.

Update: 2025-03-20 07:35 GMT
Womens Commission: సినిమాల్లో డాన్సులపై మహిళా కమిషన్ సీరియస్.. సంచలన ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తెలుగు సినిమాల్లో డాన్సులు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా మహిళపై కంపోజ్ చేస్తున్న ఐటమ్ (Item), రోమాంటిక్ (Romantic) సాంగ్స్‌ వివాదాస్పదం అవుతున్నాయి. స్టార్ హీరో (Star Hero's)లు వారి ఇమేజ్‌, థియేటర్‌కు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ (Family Audience)ను దృష్టిలో పెట్టుకుని డాన్స్‌ను కంపోజ్ చేయాల్సిన కొరియోగ్రాఫర్స్ (Choreographers) రెచ్చిపోతున్నారు. హద్దులు లేకుండా నచ్చిన రీతిలో హీరోయిన్లను ఆట బొమ్మలా ఆడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల్లో అసభ్యకర డ్యాన్సులపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women's Commission) సిరియస్ అయింది. సినిమా దర్శకులు (Directors), నిర్మాతలు (Producers) కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ పత్రికా ప్రకటను విడుదల చేశారు. అయితే, అందులో మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకర డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలు అందించడం, మహిళల గౌరవం కాపడటం అనేది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. యువత, పిల్లలపై సినిమాలు చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల శేఖర్ మాస్టర్‌ (Shekar Master) కంపోజ్ చేసిన స్టెప్పులు వివాదాస్పదమయ్యాయి. హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌ (Mister Bachan)లో కొన్ని స్టేప్స్ వివాదాస్పదం అయ్యాయి. ఓ పాటలో హీరోయిన్‌ బ్యాక్ పాకెట్లలో రవితేజ (Raviteja) చేతులు దూర్చి పిరుదులపై దరువు వేసిన స్టెప్స్‌పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇక పుష్ప-2 (Pushpa-2)లోని పీలింగ్స్ సాంగ్‌లో రష్మిక (Rashmika) నడుము లోపలి వరకు చేయి పెట్టి చేసే డాన్స్‌పై విమర్శలు వచ్చాయి. ఇటీవల నితిన్ (Nitin) హీరోగా నటించినా.. రాబిన్ హుడ్ (Robinhood) మూవీలో కేతిక శర్మ (Kethika Sharma) వేసిన స్టెప్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మహిళా లోకం మండిపడిన విషయం తెలిసిందే.

Read More..

‘అదిదా సర్‌ప్రైజ్’సాంగ్ రీక్రియేట్ చేసిన అమ్మాయిలు.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు  

Tags:    

Similar News