కోడ్ వస్తుందని ముందుగానే వైన్స్ టెండర్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్ట్
రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తొలుత అనుమతి ఇచ్చినా ఎన్నికల నియామవళికి విరుద్ధంగా హరీష్ రావు ప్రసంగంలో మాట్లాడారని రైతుబంధు సాయం పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. అయితే నిన్నటి నుంచి ఇదే అంశం చుట్టూ స్టేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కారణంగానే రైతుబంధు నిలిచిపోయిందని ఆరోపిస్తుంది.
కాంగ్రెస్ క్లియర్‌గా ఈసీ ఉత్తర్వుల్లో హరీష్ రావు చేసిన ప్రసంగం కారణంగా నిలిపివేసినట్లు ఉన్నా.. ఇంకా బీఆర్ఎస్ అబద్ధాలు ఆడుతోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఎలక్షన్ కోడ్ వస్తుందని వైన్స్ టెండర్లు వేసుకున్నావు గానీ ఎలక్షన్ కోడ్ వస్తుందని ముందుగా రైతుబంధు ఎందుకు వేయలేదు సారు..?’ అంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలే అని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.