రాహుల్‌ను మూర్ఖుడిగా నిరూపిస్తా.. లలిత్ మోడీ ఫస్ట్ రియాక్షన్

దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి..

Update: 2023-03-30 07:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల కారణంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు ఎదుర్కొంటున్నాడు. అయితే రాహుల్ పై వేటు తర్వాత ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ తొలిసారి రియాక్ట్ అయ్యారు. వరుస ట్వీట్లతో రాహుల్ పై ఎదురుదాడికి దిగారు. గాంధీ సహచరులు నేను న్యాయ వ్యవస్థ విచారణ నుంచి పారిపోయినట్లు పదే పదే అబద్దాలు చెబుతున్నారని నేనేమీ దోషిగా ప్రకటించబడలేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీపై యూకే కోర్టులో దావా వేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని మూర్ఖుడిగా నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. తాను దోషినని న్యాయస్థానం ఇంకా తీర్పు చెప్పలేదని అందువల్ల తాను సాధారణ పౌరుడినే అన్నారు. ప్రతిపక్షాలకు మరే ఇతర పని లేకపోవడం వల్ల తనపై పదే పదే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ధ్వజమెత్తారు. కాగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న లలిత్ మోడీ అనూహ్యంగా రాహుల్ గాంధీపై ఎటాక్ ప్రారంభించడం హాట్ టాపిక్ గా మారింది. లలిత్ మోడీ తాను చెబుతున్నట్లుగానే యూకే కోర్టులో కేసు వేస్తే అది రాహుల్ గాంధీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News