ఇంతమంది ఎందుకు ధర్నా చేస్తున్నారో?.. చర్చనీయాంశంగా కేటీఆర్ ట్వీట్!

పవర్ కట్స్ లేకుంటే ఇంతమంది ఎందుకు ధర్నా చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

Update: 2024-06-03 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పవర్ కట్స్ లేకుంటే ఇంతమంది ఎందుకు ధర్నా చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఉప్పల్ లో కరెంట్ కట్.. సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన ప్రజలు అని ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీనిపై కరెంటు కోతలు లేవని, 24 గంటలు నిరంతరాయంగా, విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ ఇంతమంది సబ్ స్టేషన్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు? అని ఎక్స్ లో రాసుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పుకొని, కరెంట్ పేరుపై కూడా దోచుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న తరుణంలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఓ ఇంటర్యూలో భాగంగా మాట్లాడుతూ.. కేటీఆర్ కావాలని పదే పదే కరెంట్ పోతుందని ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. దీంతో కరెంట్ కోతలపై కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం చర్చనీయాంశం అయ్యింది. కేటీఆర్ నిజంగానే ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలిసేందుకే పోస్ట్ చేశారా? లేక భట్టి మాటలకు స్పందనగా.. కావాలనే మరో ట్వీట్ పెట్టారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఏంది భట్టి సారు ఇది కూడా కావాలని పెట్టారు అంటావా? అని ఓ నెటిజన్ అనగా.. ఇది చూస్తే వాళ్లంతా బీఆర్ఎస్ వాళ్లు అని, వాళ్లని కూడా మీరే పంపించారని అంటారేమో? అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. 


Similar News