ఈసీకి, పోలీసులకు హైదరాబాద్‌ పోలింగ్‌ బూత్‌లపైనే ఎందుకు దృష్టి: అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌ పార్లమెంట్ ను తమ కంచుకొటగా చేసుకుని గత 40 సంవత్సరాలుగా గెలుస్తు వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-06 08:58 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ పార్లమెంట్ ను తమ కంచుకొటగా చేసుకుని గత 40 సంవత్సరాలుగా గెలుస్తు వస్తున్న విషయం తెలిసిందే.  ఇక్కడి నుంచి ప్రస్తుతం ఇట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం ఎంపీ అభ్యర్తి అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణలోని అన్ని పోలింగ్‌ బూత్‌లపై పోలీసులు, ఈసీ దృష్టి సారించాలి. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించాలి. అలా కాకుండా కేవలం హైదరాబాద్‌ పార్లమెంట్‌లోని పోలింగ్‌ బూత్‌లపైనే ఎందుకు దృష్టి పెట్టారు? నిజామాబాద్‌పై ఎందుకు దృష్టి పెట్టడం లేదు. ఆదిలాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాలపై ఎందుకు దృష్టి సారించడం లేదరి ఒవైసీ ప్రశ్నించారు. కాగా ఇటీవల హైదరాబాద్ మహానగరంలో 5 లక్షల నకిలీ ఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి, తొలగించిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఓల్డ్ సీటీలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇన్ని సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ బోగస్ ఓట్లతోనే గెలుస్తుందని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం హైదరాబాద్ పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి సారించారు.


Read More...

BREAKING: అసదుద్దీన్ ఓవైసీపై ఈసీకి కంప్లైంట్ చేసిన మాధవీలత 


Similar News