కవిత అరెస్ట్ రాజకీయ ప్రయోజనమెవరికి?
పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్‌కు రూ. 15 వేలు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే సభ ఎన్నికల ముందు నిన్న ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో రాజకీయ ప్రయోజనం ఎవరికి ఉంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే బీజేపీ పార్టీ కావలనే లిక్కర్ స్కామ్‌లో అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, కవిత అరెస్ట్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో మైలేజ్‌గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ ఎపిసోడ్‌ను ఎన్నికల ముందు పక్కదారి పట్టించడానికే బీజేపీ రాజకీయ కుట్ర పన్నుతోందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల పాలనపై కూడా చర్చ పక్కకు జరిగిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ అరెస్టు టాపిక్ ఇరు పార్టీలకు ఎన్నికల్లో మైలేజీగా మారుతోందని, బీఆర్ఎస్‌కు డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.