"Where is KCR".. వరదలపై స్పందించరే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.

Update: 2024-09-03 08:51 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికి మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ ఎందుకు కనిపించడం లేదని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో కేసీఆర్ కనిపించడం లేదని.. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడిన గందరగోళ పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని.. ఆయన చెప్పుకొచ్చారు. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పడు సమీక్షిస్తూ.. అధికారులతో చర్చిస్తూ.. పరిస్థితులను ఆరా తీస్తున్నారన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా.. అన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


Similar News