'ఉద్యమకారులపై ఉపా కేసులా..?'

ఉద్యమకారులపై 'ఉపా' కేసులు నమోదు చేయడమేమిటనీ? టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.

Update: 2023-06-17 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమకారులపై 'ఉపా' కేసులు నమోదు చేయడమేమిటనీ? టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్​లో ఆయన మాట్లాడుతూ.. ప్రో హరగోపాల్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ప్రో హరగోపాల్ ఎన్నో సార్లు పోలీసులు, నక్సల్స్​మధ్య శాంతి చర్చలు జరిపినట్టు గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకతతోనే కేసీఆర్​భయపడ్డాడన్నారు. దీంతో కేసును వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్​ అధికారంలోకి వచ్చాక పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు,మంత్రులు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మేధావులు, విద్యావేత్తలపై, రాజద్రోహం కేసు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచి వేయడం సరికాదన్నారు.


Similar News