ఏపీ సీఎం జగన్ బాటలో రేవంత్ రెడ్డి.. కారణం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకు వలంటీర్ వ్యవస్థను సృష్టించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వలంటీర్లను నియమించారు.

Update: 2024-04-11 14:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకు వలంటీర్ వ్యవస్థను సృష్టించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వలంటీర్లను నియమించారు. వృద్ధులకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు ఫలితాలు వారి గడప వద్దకు తీసుకెళ్లడం వలంటీర్ల పని. దేశవ్యాప్తంగా ఈ వలంటీర్ వ్యవస్థకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా త్వరలో వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతున్న వలంటీర్ వ్యవస్థను తెలంగాణలో తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని పథకాలు చేరువయ్యే విధంగా కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. నాడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు సక్రమంగా చేరువయ్యేలా చూడాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ‘ఇందిరమ్మ కమిటీ’ ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. కమిటీల్లో నియమితులైన వారికి ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News