నిరుద్యోగ భృతి ఏమైంది..? MLA Raghunandan Rao

రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో గళం విప్పారు.

Update: 2023-02-08 15:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో గళం విప్పారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఎందుకు నిధులు కేటాయించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. క్రీడాశాఖకు బడ్జెట్ లేదని, కనీసం పాలసీ కూడా లేదని ధ్వజమెత్తారు. కోచ్‌ల నియామకం ఊసెత్తలేదని మండిపడ్డారు. సొంతజాగా ఉన్నవారికి రూ.3 లక్షల స్కీంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదెందుకని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడంపై రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వమే నేరుగా వారి సంక్షేమం చూడాల్సింది పోయి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.8 వేలకు కేంద్రం పెంచిన విషయాన్ని రఘునందన్ రావు గుర్తుచేశారు.

Also Read..

తెలంగాణను అప్పులపాలు చేశారు: ప్రభుత్వంపై భట్టి ఫైర్  

Tags:    

Similar News