వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా వాతావరణ ఒక్క సారిగా చల్లబడింది.

Update: 2024-06-10 03:13 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా వాతావరణ ఒక్క సారిగా చల్లబడింది. అయితే తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, సిద్ధిపేట, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, వైఎస్సాఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయగోదావరి, బాపట్ల, కృష్ణ, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Similar News