తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణ అంతటా నైరుతి పవనాలు విస్తరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా

Update: 2024-06-14 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణ అంతటా నైరుతి పవనాలు విస్తరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మోస్తారు వాన పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రుతు పపనాల ప్రభావంతో వారం తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులను ఐఎండీ అలర్ట్ చేసింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లాలని అలర్ట్ చేసింది. 


Similar News