CV Anand: హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని అసాంఘీక శక్తులు, పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సమాచారం మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-10-28 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని అసాంఘీక శక్తులు, పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సమాచారం మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగరంలో నెల రోజుల పాటు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెలా నవంబర్ 28 వరకు ఆంక్షలు అందుబాటులో ఉంటాయని సీవీ ఆనంద్ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ - 163 (BNS Section-163) ప్రకారం.. ఐదుగురికి కన్నా ఎక్కువ మంది గుమిగూడితే వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.    

Tags:    

Similar News

టైగర్స్ @ 42..