ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడుతాయి.. మండు వేసవిలో ‘స్కైమెట్’ గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలే ఎండలు ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలే ఎండలు ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ సంస్థ స్కైమెట్ చల్లటి కబురు చెప్పింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిమీలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది.