నిరుపేదలకు త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తాం : మంత్రి సీతక్క

నిరుపేదలందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2025-01-04 12:36 GMT

దిశ, నందిగామ : నిరుపేదలందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అప్పారెడ్డి గూడ, వీర్లపల్లి, చేగుర్, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హాజరై శంకుస్థాపనలు ఎమ్మెల్యే శంకర్ తో కలిసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. మహిళా సంఘ సభ్యులు సంఘంలో లోన్ తీసుకొని చనిపోతే లోన్ కట్టనవసరం లేదని మంత్రి తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు భూమిలేని వారికి ఏడాదికి రూ. 12,000 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది అన్నారు. రైతన్నకు వడ్లకు బోనస్ కింద 500 చెల్లిస్తున్నామన్నారు.

చేగూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కుటుంబ పాలన చేసి అవినీతి రాజ్యమేలిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అవీనీతిని బయటపడకుండా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో మహిళల సంఘాలను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు 100 కోట్ల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ వెసులుబాటు కల్పించిందని, మహిళలు ఎక్కడికి వెళ్లిన పూర్తి ప్రాధాన్యత కాంగ్రెస్ కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మంకాల శ్రీశైలం, కావాలి కృష్ణ, సీతారాం, వెంకటేష్, అన్వర్, సాజిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News