BRS: శైలజ కుటుంబానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి శైలజ అనే విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి శైలజ అనే విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC kavitha).. మృతి చెందిన శైలజ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శైలజ మృతి బాధాకరమని, బాలిక చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం(Financial Assistance) ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. శైలజ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. శైలజ మృతి పట్ల బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్నీ హామీలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాగా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన శైలజా అనే విద్యార్ధిని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.