BJP: ఏసీబీ విచారణకు వెళ్లి కేటీఆర్ డ్రామాలు.. బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
కేటీఆర్(KTR) ఏసీబీ విచారణ(ACB Inquiry)కు వెళ్లి తమాషాలు చేస్తున్నాడని, కేసీఆర్(KCR) ఇంకా సీఎం అనుకుంటున్నాడా..? అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Aravind) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్:కేటీఆర్(KTR) ఏసీబీ విచారణ(ACB Inquiry)కు వెళ్లి తమాషాలు చేస్తున్నాడని, కేసీఆర్(KCR) ఇంకా సీఎం అనుకుంటున్నాడా..? అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Aravind) అన్నారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్.. లాయర్ లేకుంటే విచారణకు వెళ్లను అని డ్రామాలు చేస్తున్నాడని అన్నారు.
అలాగే కేటీఆర్ లాంటి నప్పతట్లొడు అడుక్కుంటే.. పాపం అని పచ్చిపులుసు పోస్తే.. నేతి బుట్ట లేదని లేచి పోయిండంట అని ఎద్దేవా చేశారు. మీరు చేసిందే దొంగతనం మళ్లీ అందులో నేను అడ్వకేట్ ని తీసుకొని పోతా అని మాట్లాడుతున్నడని, మీ అయ్య ఇంకా సీఎం అనుకుంటున్నవా అని దుయ్యబట్టారు. అంతేగాక తెలంగాణను దోచుకుని తిన్నారని, లక్షల కోట్లు అప్పులు చేశారని, పదేళ్లు తెలంగాణ అప్పుల నుంచి బయటికి రాకుండా చేశారని మండిపడ్డారు. ఇవన్నీ చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాట్లాడుతున్నారని, చట్టాన్ని పని చేయనియ్యకపోతే.. లాఠీ తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.