చెరుకు రైతులకు పూర్వవైభవం తీసుకొస్తాం : మంత్రి దామోదర్‌

చెరుకు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి మేలు కోసమే ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలను అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.

Update: 2024-11-08 14:08 GMT

దిశ, అందోల్‌: చెరుకు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి మేలు కోసమే ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలను అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. చెరుకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. శుక్రవారం రాయికోడ్‌ మండలం మాటూరు గ్రామ శివారులో గొదావరి గంగా ఆగ్రో ప్రోడక్టస్‌ ప్రైవేటు లిమిటేడ్‌ (చక్కెర కార్మాగారం)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 12 షుగర్‌ ప్యాక్టరీలు ఉండగా, కేవలం 6 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్క షుగర్‌ ప్యాక్టరీ నిర్మాణం జరగలేదని, కేవలం 10 నెలల వ్యవధిలో ఫ్యాక్టరీని నిర్మాణం చేపట్టిన యాజమాన్యానికి ఆయన అభినందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కొరుకునే ప్రభుత్వమని, రైతులేవ్వరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన ప్రకటించారు. రూ.250 కోట్లతో నిర్మించిన ఈ ప్యాక్టరీలో ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ పరిశ్రమలో 4 లక్షల టన్నుల చెరుకు ప్రెస్సింగ్‌ చేసే సామర్థ్యం ఉందన్నారు.

ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో రాయికోడ్, నారాయణఖేడ్, రేగోడు, మునిపల్లి, అల్లాదుర్గ్, జహీరాబాద్, శంకరంపేట ప్రాంతాల చెరుకు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కర్, మధ్యప్రదేశ్‌ శాసనసభ్యులు మోంట్‌ సోలంకి,సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ గొల్ల అంజయ్య, సంస్థ యాజమాన్యం గోయల్‌–బండారి కుటుంబ సభ్యులు, రాయికోడ్‌ మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు, మాజీ ఎఎంసీ చైర్మన్‌ ఏసయ్య, నాయకులు శివకుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News