బండి సంజయ్‌ని అర్ధరాత్రి ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో చూడండి (వీడియో)
నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బండి సంజయ్ ఇంటి వద్దకు భారీ చేరుకున్న పోలీసులు 12.30 గంటలకు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ ను తిమ్మాపూర్ మీదుగా తీసుకెళ్తుండగా ఎల్ ఎండీ వద్ద పోలీసులు వాహనం మోరయించినట్లు తెలిసింది.
మరో వాహనాన్ని తెప్పించి బండి సంజయ్ ను అందులోకి పోలీసులు ఎక్కించి తరలించారు. అయితే బండి సంజయ్ అత్తమ్మ ఇటీవల చనిపోగా 9 వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు బండి సంజయ్ కరీంనగర్ కు వచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయటపెట్టేందుకు రేపు ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టేందుకు బండి సంజయ్ సిద్ధమైన నేపథ్యంలో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.