ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు.. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కడియం
వర్గీకరణ పై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది . దానిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ లోని ఎన్ ఎమ్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
దిశ, జనగామ : వర్గీకరణ పై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది . దానిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ లోని ఎన్ ఎమ్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ చేపట్టారు. వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు.. నిర్ణయాన్ని వెల్లడించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పును వెల్లడించింది.
దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.కొందరు వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లుతుందని విష ప్రచారం చేయడం సిగ్గు చేటు అని ఎద్దేవా చేశారు.మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో గత జాబ్ నోటిఫికేషన్ లకు మరియు వచ్చే జాబ్ నోటిఫికేషన్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని తెలిపారని గుర్తు చేశారు.. 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్ ఆర్ పి ఎస్ దండోరా నాయకులకు తోడుగా ఉన్నాను అని తెలిపారు .తన వంతు చేసిన పనులు గుర్తు చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి నాగేందర్ అజయ్ రాంబాబు దిలీప్ రెడ్డి నాగరాజు లింగాల జగదీశ్వర్ రెడ్డి గొల్లమాజై దూసరి గణపతి బోయిని రాజు తీగల సిద్దు గౌడ్ పోరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు .