భగీరథ భారమైంది..వెంటాడుతున్న తాగునీటి కష్టాలు
పట్టణవాసులకు పక్షం రోజులుగా తాగునీటి కష్టాలు
దిశ,డోర్నకల్ : పట్టణవాసులకు పక్షం రోజులుగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని పుర చైర్మన్ వాంకుడోత్ వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..గత ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది.ఏదో ఒక సమస్యతో అంతరాయం ఏర్పడుతూనే ఉంది.గతంలో ఊర్లలో నల్ల బావులు,బోర్లు ద్వారా నిరంతరం నీటి సరఫరా ఉండేది.భగీరథ పథకం తో ప్రజలు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పరిష్కరించడం లేదని తెలిపారు.భగీరథ పైపులు బ్రేక్ చేయాలన్న ఆవేదన ఉందన్నారు. ప్రజల కోసం దేనికైనా రెడీ అన్నారు. మున్నేటి పై మోటర్లు మరమ్మతులు జరిపి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.