Singareni : ఆగని ముసురు.. నిలిచిన ఉత్పత్తి
జయశంకర్ జిల్లా సింగరేణి భూపాలపల్లి, మల్హర్ మండలం తాడిచర్ల ఉపరితల గని ప్రాంతాలలో కురుస్తున్న ముసురు వర్షం ఆగక కోల్ మైనింగ్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
దిశ,మల్హర్ : జయశంకర్ జిల్లా సింగరేణి భూపాలపల్లి, మల్హర్ మండలం తాడిచర్ల ఉపరితల గని ప్రాంతాలలో కురుస్తున్న ముసురు వర్షం ఆగక కోల్ మైనింగ్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో క్వారీలలో నిలిచిన వరద నీరు వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ 2,3 కేటీకే ప్రాజెక్టులల్లో, జెన్కో తాడిచర్ల బ్లాక్-1 ఏఎమ్మర్ ప్రాజెక్టులో బొగ్గును వెలికి తీయడం సాధ్యపడలేదు.
అదేవిధంగా కోల్ ఆపరేషన్, ఓవర్ బర్డెన్(ఓబి) పనులు నిలిచిపోయాయి. రహదారులు బురదమయం కావడంతో యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొనడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఉపరితల గనుల సంస్థలు రోజువారీగా తీసే మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆ సంస్థలకు కొంత నష్టం వాటిలినట్లు తెలిసింది.