ముఖ్యమంతి పర్యటన వేళ ట్రాఫిక్ రూల్స్ ఇలా..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జనగామ జిల్లా ఘనపూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఆదివారం ఉన్నందున వాహనదారులకు కింది విధంగా పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది
దిశ, జనగామ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జనగామ జిల్లా ఘనపూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఆదివారం ఉన్నందున వాహన దారులకు కింది విధంగా పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. నెల్లుట్ల, కుందారం, కోలుకొండ, ఈరంటి, గూడూరు, ఇప్పగూడెం నుండి వచ్చే వాహనాలు లక్ష్మీ వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంది. రఘునాథ్ పల్లి మండలంలోని కోమల్ల, గోవర్ధనగిరి, కుర్చపల్లి గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా రాఘవపూర్ కుర్చపల్లి, ఇప్పగూడెం నుండి లక్ష్మీ వెంచర్ కు చేసుకోవాలి. రఘునాథపల్లిలోని మిగతా గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా రఘునాథపల్లి, కంచనపల్లి, ఈరెంటి, గూడూరు, ఇప్పగూడెం నుండి లక్ష్మీ వెంచర్ లోకి రావాలి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం, కోమటిగూడెం, రంగరాయగూడెం, సముద్రాల గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా ఇప్పగూడెం నుండి లక్ష్మీ వెంచర్ పార్కింగ్ కు చేసుకోవాల్సి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని చాగల్, కొత్తపల్లి, తాటికొండ, మీదికొండ, రాఘవాపూర్ గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా రాఘవాపూర్ కూర్చేపల్లి, ఇప్పగూడెం నుండి లక్ష్మీ వెంచర్లు పార్కింగ్ కు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని మిగతా గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా స్టేషన్‌ఘన్‌పూర్ నుండి లక్ష్మీ రైస్ మిల్ వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జాఫర్ గడ్ మండలంలోని జాఫర్గడ్, ఉప్పుగల్, తిమ్మంపేట, తెలుగు తమ్మడపల్లి, సాగరం, రేగడి తండా, రఘునాథపల్లి, ఓబులాపూర్, కోణాయిచలమా, దురియతండా, తిమ్మాపూర్ గ్రామాల నుండి వచ్చే వాహనాలు లక్ష్మీ రైస్ వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంది. జాఫర్గడ్ మండలంలోని షాపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా గూడూరు, ఇప్పగూడెం నుండి రావాలి. జాఫర్గడ్ మండలంలోని తీగారం, సూరారం, మాగ్దూంతండా నుండి వచ్చే వాహనాలు వయా గూడూరు, ఇప్పగూడెం నుండి లక్ష్మీ వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాలి. చిల్పూర్, ధర్మసాగర్ మండలం, వేలేరు మండలంలోని అయినవోలు అన్ని హనుమకొండ వైపు నుండి వచ్చే వాహనాలు వయా స్టేషన్‌ఘన్‌పూర్ నుండి లక్ష్మీ రైస్ మిల్లు వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాలి. ఈ బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు కలిపి మొత్తం 850 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చేపట్టనున్నట్టు తెలిపారు.
READ MORE ...
రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో CM రేవంత్ హాట్ కామెంట్స్