వెహికిల్ ఉపయోగించకపోయినా ఈ చలానా.. ములుగు జిల్లాలో ఏం జరిగిందంటే..

వాహ‌నదారులు త‌మ వాహ‌నాల‌పై ప్రయాణం చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు.

Update: 2023-04-01 10:06 GMT
వెహికిల్ ఉపయోగించకపోయినా ఈ చలానా.. ములుగు జిల్లాలో ఏం జరిగిందంటే..
  • whatsapp icon

దిశ, ములుగు ప్రతినిధి: వాహ‌నదారులు త‌మ వాహ‌నాల‌పై ప్రయాణం చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ట్రాఫిక్, పోలీసులు వాహ‌నాలపై విధించే చ‌లాన్లు వాహ‌నాదారులకు భారంగా తయారవుతున్నాయి. చ‌లాన్ల విషయంలో వారు చేస్తున్న పొరపాట్లు సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో రోడ్లపై వెళ్లే వాహనదారులు భయపడే విషయం ఒక‌టి ములుగు జిల్లాలో జరిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ములుగు జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పాయిరాల సంపత్ టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ టూవీలర్ కలిగి ఉన్నాడు.

దాని రిజిస్ట్రేషన్ నెంబర్ TS25E2784 అతను ఆ బండిని ఉపయోగించక దాదాపుగా 20 రోజులు అవుతుంది. కానీ ఆ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ మీద మార్చి 31 తేదీన సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు 'ఈ చలాన్' విధించినట్టు టూవీలర్ యజమానికి మొబైల్ లో పోలీస్ ఈ చలాన్ నుంచి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా కంగుతిని, ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే దానిలో కనిపిస్తున్న ఈ చలానా ఫోటో లో తన బండి కాదు, తన నెంబరు కాదు కానీ తన బండి నెంబర్ మీద ఈ చలాన వచ్చిందని తేరుకొని చలానా మీద ఉన్న పోలీస్ స్టేషన్, అధికారి, స్థలం వివరాలు పరిశీలించగా జూకల్ క్రాస్ రోడ్ కొత్తపేట, చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని ఉంది.

దీంతో పోలీసులు తన ద్విచక్ర వాహనం నెంబర్ పై తప్పుగా ఈ చలాన్ విధించారని తెలుసుకున్నాడు. తాను చేయ‌ని త‌ప్పుకు త‌నపై అన్యాయంగా ఈ చ‌లాన్ విధించారని స‌ద‌రు వాహ‌నదారుడు ఆవేద‌నం వ్యక్తం చేస్తున్నాడు. చ‌లాన్ పేరుతో సంబంధం లేని వాహ‌నదారుల‌కు ఫైన్ విధించ‌డం, వారు చేస్తున్న విధుల ప‌ట్ల నిబ‌ద్దత‌పై ప్రజ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ శాఖ‌కు సంబంధించిన ఉన్నతాధికారులు చ‌లాన్లు విధించ‌డంలో పొర‌పాటు చేస్తున్న అధికారులపై శాఖ ప‌ర‌మైన‌ చ‌ర్యలు తీసుకోవాల‌ని ప్రజ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News