MLA Etela Rajender : ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు
రేపటి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలను 24 గంటల ముందు ముందస్తు అరెస్టులను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల తీవ్రంగా ఖండించారు.
దిశ, కమలాపూర్: రేపటి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలను 24 గంటల ముందు ముందస్తు అరెస్టులను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పోలీసుల రాజ్యం చేసి పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని అన్నారు.
బీఆర్ఎస్ నాయకుల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అరెస్టు చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. గతంలో జరిగిన నిర్మాణాలకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని ఈటల ఆరోపించారు.