సంక్షేమ హాస్టల్ నిండా సమస్యలే

Update: 2024-08-14 09:35 GMT

దిశ, చిట్యాల: సంక్షేమ హాస్టల్ మొత్తం సమస్యలతో నిండిపోయింది. స్నానం చేసే గదులకు డోర్లు లేని పరిస్థితి నెలకొంది. హాస్టల్ లోపల పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ఇన్ చార్జి వార్డెన్ కేటాయించడం వల్ల, ఒకే వార్డెన్ మూడు హాస్టల్లకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తక్షణమే పర్మినెంట్ వార్డెన్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, మండలాల్లో ఉన్నటువంటి బాల బాలికల లోకల్ హాస్టల్లో బలోపేతానికి, మౌలిక వసతులు కల్పించడానికి, ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రతి హాస్టల్ కు తప్పనిసరిగా వార్డెన్ ను స్థానికంగా ఉండేటట్లు చేయాలని, పిల్లలకు రక్షణ కల్పించాలని ,జిల్లా ఉన్నత అధికారి ప్రతి హాస్టల్ ను నెలలో ఒక్కసారైనా సందర్శించి, సమస్యల పైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఏ ఐ ఎస్ ఏ విద్యార్థి సంఘ జిల్లా ఇంచార్జ్ చెరిపెల్లి విజయ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News